Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పన్ను వసూళ్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు.గురువారం నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ ఫీజులు వసూళ్లను బిల్ కలెక్టర్లు 100 శాతం వసూలు చేసేలా విధులు నిర్వహించాలన్నారు. సెలవు రోజులలో కూడా పన్నులు మున్సిపల్ కార్యాలయంలోనూ బిల్ కలెక్టర్ల వద్ద తీసుకోవలన్నారు. ప్రజలం దరూ ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకుని పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వాణి రెడ్డి , కార్యాల యం మేనేజర్ చంద్రశేఖర్ ,బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.