Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
కంటి వెలుగు ద్వారా అంధత్వ రహిత సమాజాన్ని నిర్మిద్దామని నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పడాల సాయి బాబాలు అన్నారు. నాచారం వెంకటేశ్వర భక్త సమాజంలో(కమ్యూనిటీ హాల్) ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగుల పరీక్ష కేంద్రాన్ని గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ప్రతినిధులందరూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కంటి వెలుగుల కార్యక్రమాన్ని నాచారం ఓల్డ్ విలేజ్, అంబేద్కర్ నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ పాండురంగం గౌడ్, శ్రీశైలం, యాదగిరి గౌడ్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.