Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డ్ ఏడో వార్డులోని లాల్బజార్లో హనుమాన్ ఆలయాన్ని తెరిపించాలని, ఆలయానికి దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు రంగ రవీంద్ర గుప్తా గురువారం మంత్రి హరీశ్‌రావును, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోరుకుమార్ను కలిసి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ హనుమాన్ దేవాలయానికి భక్తులను పోనీయకుండా ఆర్మీ అధికారులు వెనుకదారి మూసేశారని ఆరోపించారు. దాంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ఆ దారిని తెరిపించాలని కోరారు. కలెక్టర్‌కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఆలయాన్ని తెరిపించి, ఆలయం దారిని తెరిపించేందుకు మంత్రి హామీ ఇచ్చారని రంగారావు తెలిపారు. కార్యక్రమంలో జార్జ్ పవన్ గౌడ్, అమిత్, వెంకట్, రాజేందర్ పాల్గొన్నారు.