Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులకు (నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శామీర్ పేట మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయన ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ సత్యనారాయణకు, ఎండీపీఓ వాణి గరుదాస్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో ఉన్న గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు నవంబర్ నుండి జీతాలు ఇవ్వడం లేదని, జీతాలు లేకుండా కార్మికులు ఎలా బ్రతకాలి అని ఆయన ప్రశ్నించారు. గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే జీతం ఇవ్వాలని, లేనిపక్షంలో 13వ తారీకున కలెక్టరేట్‌ను ముట్టడి స్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత కార్మికులపై వివక్షత చూపిస్తున్నామని చెప్పారు. వెంటనే వివక్షత అరికట్టాలని కార్మికులకు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీిఐటీయూ జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులందరూ, జీతాలు వస్తున్నాయి కానీ దళితులైన గ్రామపంచాయతీ కార్మికులకు ఐదు నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని అసెంబ్లీలో చెప్పిన పద్ధతిలో పీఆర్సీ 30% ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికుల ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 13వ తారీఖున జరుగుతున్న కలెక్టరేట్ ముట్టడిను కార్మికులందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిష్టప్ప యాదగిరి, ఆరోగ్యం, బి.లక్ష్మయ్య, లింగయ్య, ముత్యాలు, రేణుక, లక్ష్మి, నవనీత, దాదాపు కార్మికులు పాల్గొన్నారు.