Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ జి.సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా మహిళ దినోత్సవం వేడుకలు నిర్వహిం చారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ కోర్టు న్యాయమూర్తులు ఆర్.లావణ్య, కె.పార్థ సారథిó రావు, జెడ్పీటీసీ శైలజ విజయానంద రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఏపీపీ సుగుణాదేవి విచ్చేశారు. అనంతరం సర్పంచ్ న్యాయమూర్తులు, జెడ్పీటీసీ ఉపాధ్యాయులకు, మహిళల, గ్రామపంచాయతీ సిబ్బందిని శాలువలతో సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ మహిళలు సమాజంలో పోటీపడి మరీ ముందుకు దూసుకు పోతున్నారని అన్నారు. వారిని ప్రోత్సహిస్తు మహిళలపై ఎల్లపుడూ గౌరవం చాటలన్నారు. న్యాయమూర్తి లావణ్య మాట్లాడుతూ గౌడవెల్లి గ్రామంలో ఇలాంటి మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మహిళలకు న్యాయపరంగా కొన్ని సలహాలు సూచనలు వారికి తెలియజేశారు. జెడ్పీటీసీ శైలజ విజయానందారెడ్డి మాట్లాడుతూ మహిళలు లేనిదే సమాజంలో విలువ లేదని పురుషుల పోటీగా మహిళలు కూడా పోటీ పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శేఖర్‌రెడ్డి, అడ్వకేట్లు జి.శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పి.సదానందగౌడ్, కోఆప్షన్ సభ్యులు డి గోపాల్, జిల్లా, మండలపరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, వైద్యశాఖ ఆశలు, డ్వాక్రా మహిళలు, పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తులు, సర్పంచ్, జెడ్పీటీసీ ఉపాధ్యాయులకు, మహిళలకు, గ్రామపంచాయతీ సిబ్బందికి శాలువలతో సన్మానించారు.