Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ డివిజన్లో గంగపుత్ర కాలనీలోని కమ్యూనిటీ హాల్ లో మహిళలకు కుట్టు శిక్షణా సెంటర్ ప్రారంభమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ జనని పాల్గొని కుట్టు మిషన్లను ఉచితంగా ఈ సెంటర్కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రీ భాయి ఫూలే కుట్టు సెంటర్ పేరుతో ఇక్కడి మహిళా సంఘం ద్వారా ప్రారంభ మవుతున్న ఈ కుట్టు సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యూనియన్ బ్యాంక్ కూడా మహిళా సాధికారతకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. డిప్యూటీ హెడ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, యూనియన్ బ్యాంక్ ఇకముందు కూడా కుట్టు నేర్చుకున్న మహిళలకు లోన్లు ఇచ్చి స్వంత మిషన్లు కొనుక్కొనేందుకు సహకరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ రోహిణి మాట్లాడుతూ.. మహిళలు తమ స్వయం కషితో జీవనం సాగించేందుకు యూనియన్ బ్యాంక్ ఇటువంటి పలు కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కె.నాగలక్ష్మీ ఏ పద్మ, లక్మి,ప్రవళిక,పుష్ప తదితర మహిళలు పాల్గొన్నారు.