Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తయ్య విధంగా అధికారులు సంబంధించిన కాంట్రాక్టర్లు దృష్టి సారించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం కాచిగూడ డివిజన్ పరిధిలోని కుద్బిగూడలో రూ. 15 లక్షలతో వేయనున్న మంచి నీటి పైప్ లైన్ రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించ నున్న డ్రయినేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమారమేష్ యాదy, సీనియర్ నాయకులు డాక్టర్ శిరీష ఓం ప్రకాష్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో, మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలలో, గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అభివద్ధి పనులు జరుగుతు న్నాయని తమ ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు తాత్కాలికంగా కాకుండా, దశల వారీగా శాశ్వత ప్రతిపాదికపైన పరిష్కారాలు అందిస్తున్నట్టు తెలిపారు. కుద్బిగూడలో ప్రారంభించిన ఈ పైప్ లైన్లు పూర్తి అవడంతో ప్రజలకు పరిశుద్ధమైన మంచి నీరు లభిం చడంతో పాటుగా, కలుషిత మంచి నీటి సమస్య, డ్రయినేజీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అలాగే బస్తీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు.. దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా మంచి నీరు, డ్రయినేజీ పైప్ లైన్ పనుల్లో నాణ్యత లోపం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కాచిగూడ డివిజన్ అధ్యక్షులు ఎర్ర భీష్మ దేవ్, సీనియర్ నాయకులు ధాత్రిక్ నాగేందర్ బాబ్జి, సదానందు, బబ్లు, అంటో, రాకేష్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.