Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు
నవతెలంగాణ-అంబర్పేట
విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అందుకు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు పోలీసు సిబ్బందితో అవగాహన కల్పించాలని ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు. ఈ మేరకు గురువారం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేగంపేట, హైదరాబాద్ వారితో పాటు , బేగంపేట టిటిఐ సిబ్బంది వెంకటప్రసాద్ ,నరసింహులు ఆధ్వర్యంలో ఎయిర్టెల్ హెడ్ ఆఫీస్ సిబ్బందితో వారు రోడ్డు భద్రత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహించారు. స్టాప్ లైన్, ట్రిబల్ రైడింగ్, ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా రోడ్ల పై ట్రాఫిక్ నియంత్రణలు చేస్తారు వాటి గురించి చూపిం చారు. ముఖ్యంగా యువత సెల్ఫోన్ డ్రైవ్ చేస్తూ, రాంగ్ రూట్ పోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని.. దాని వల్ల వారి అమూల్య మైన ప్రాణాలు పోగొట్టుకోని వారి కుటుంబాలలో విషాదఛాయలు నెలకొంటున్నాయని చెప్పారు. అతివేగంగా వాహనాలు నడపడం ప్రమాద కరమని.. రహదారులపై క్రమశిక్షణగా వ్యవహారించాలి అని సూచించారు. ఇతరుల రక్షణకు వాహనాలను జాగ్ర త్తగా నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో 100 మంది ఎయిర్టెల్ ఆఫీస్ సిబ్బందితో జరిగింది. చిన్న చిన్న సమ స్యల కు కూడా భయపడి, ప్రాణలు తీసుకొవద్దని, ధైర్యంగా సమస్యలను ఎదురు కోవాలని ఏసీపీ అన్నారు. ఈ కార్యక్ర మంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.