Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెమొక్రటిక్ సంఘం సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు బ్రహ్మచారి చైతన్య
నవతెలంగాణ-అడిక్మెట్
తెలంగాణలో విద్య హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సీ)ని వెంటనే అమలు చేయాలి అని డెమొక్రటిక్ సంఘం సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు బ్రహ్మచారి చైతన్య డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ సంఘం, సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో డెమొక్రటిక్ సంఘం అధ్యక్షులు సన్యాసి బ్రహ్మచారి చైతన్య హాజరై మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యా హక్కు ఉంద న్నారు. ఈ ప్రాథమిక హక్కు మద్దతుగా ఉచిత , నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో పార్లమెంట్లో ఆమోదం పొందింది అని తెలిపారు. సెక్షన్ 12(1)( సి )ప్రకారం రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రవేశస్థాయి తరగతులు చేర్చుకోవడం ప్రాథమిక చదువు పూర్తి అయ్యేవరకు ఉచిత విద్యను అందించడం తప్పనిసరి అన్నారు. కనీసం 25 శాతం వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ప్రకారం ఆర్టీఏ చట్టంలోని సెక్షన్ ద్వారా అందరికీ సమ్మేళిత ప్రాథమిక విద్యను అందించడం ద్వారా మాత్రమే సమానత్వం సామాజిక న్యాయం ప్రజాస్వామ్యం విలువలు సాధించవచ్చు అని తెలిపారు. ఈ చట్టం 2010 నుంచి అమలులోకి వచ్చినప్పటికీ ఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అసమర్ధత వలన అమలు చేయకపోవడంతో బడుగు బలహీనమైన వెనుకబడిన సమూహాలకు చెందిన దాదాపు పది లక్షలకు పైగా పిల్లలు ప్రాథమిక హక్కులను ఉల్లంగించబడుతున్నాయన్నారు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 .21 ఉల్లంఘనకు దారితీ స్తుందని తెలిపారు. భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద అన్యాయం ఏంటంటే పిల్లలకు నాణ్యమైన విద్యను పొంద డం అందించడంలో ప్రభుత్వాలు విఫలం అవడం అని తెలిపారు. విద్య హక్కులను సెక్షన్ 12(1) (సీ) ప్రతి బిడ్డకు సమాన అవకాశాన్ని కల్పిస్తుంది భారతదేశంలో మనకు నిజ మైన సమానత్వం ఉంటుందని నిర్ధారిస్తుందని తెలిపారు. విద్య హక్కు చట్టం సెక్షన్ 12(1 )(సి)ని వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.