Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉమెన్ ఇన్ లీడర్షిప్ కాన్క్లేవ్ రూపంలో హైదరాబాద్‌లోని జి నారాయ ణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్‌లో 182 మంది మహిళా నాయకులు, లింగ న్యాయవాదులతో అతిపెద్ద సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జి శ్రీవిద్యా రెడ్డి మహిళా సదస్సు సమ్మేళనానికి విశేష కృషి చేశారు. ఈ సదస్సులో ఆర్ట్స్, బిజినెస్, పాలసీ,టెక్ అకాడెమియా నాయకులు పాల్గొన్నారు.
ఈ సమ్మేళనాన్ని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ప్యానెల్ చర్చల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ (ఐఏఎస్), యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, హరిచందన దాసరి (ఐఏఎస్) పాల్గొన్నారు.ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి బడుగుల (ఐపీఎస్), బ్యూరోక్రాట్ల నుంచి దీపక్ తివారీ (ఐఏఎస్)కళల నుంచి, మిస్ ఇండియా 2021 మానస వారణాసి, నటీనటులు మహేశ్వరి కొండపర్తి ప్రదీప్,డిజైనర్ వరుణ్ చక్కిలం, పూజిత కృష్ణ - ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్, శ్రేయా చిలక్ - సంగీత విద్వాంసుడు, ఫోటోగ్రాఫర్ గాయ త్రి రెడ్డి, సందీప్ మొలుగు, మేకప్ ఆర్టిస్ట్, గిరిజన చెరియాల్ ఆర్టిస్ట్ పసుల హాజరై ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. కాన్క్లేవ్ చైర్పర్సన్ శ్రీవిద్యా రెడ్డి మాట్లాడుతూ... ''మహిళా నాయకులు తమ స్ఫూర్తిదా యకమైన ప్రయాణాలు,విజయాలు వైఫల్యాలను పంచుకో వడానికి మన యువ తరాలను, ముఖ్యంగా అమ్మాయిలను తమను తాము నమ్ముకునేలా ప్రేరేపించడానికి ఒక వేదిక అవసరమని మేము గుర్తించాము' అన్నారు.
'65కి పైగా ఈవెంట్లను నిర్వహించి, 110 ప్లస్ మంది మహిళా నాయకులు, 1034 మంది ప్రతినిధులను ఆకర్షించి, 60 ప్లస్ లింగ వాదులను సంపాదించి, 48 సంస్థలతో భాగస్వామ్యమైన ఈ అద్భుతమైన సమ్మేళనాన్ని రూపొందించడానికి ఇది మాకు స్ఫూర్తినిచ్చింది. గత రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మా విద్యార్థి సంఘం కీలకపాత్ర పోషిస్తోంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి బృహత్తర కార్యక్రమం యువతులచే నడపబడటం హర్షణీయం' అని తెలిపారు.
'ఈ చైతన్యవంతమైన యువత కోసం మరిన్ని అవకాశాలను సృష్టించాలనే మా సంకల్పానికి ఇది మరింత బలం చేకూర్చింది. మేము దీన్ని కొనసాగిస్తాము. నాయకత్వంలో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, భవిష్యత్ తరాల మహిళా నాయకులకు స్ఫూర్తినిచ్చేందుకు అనేక మంది మహిళా నాయకులు, లింగ న్యాయవాదులు మా లక్ష్యంలో చేరారు. మా దార్శనికతను విశ్వసించి నందుకు మా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిజి లార్సన్ - కీనోట్ స్పీకర్ మహిళా భద్రతా విభాగం అదనపు డిజిపి శిఖా గోయెల్ (ఐపీఎస్) సహా వక్తలందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం' అని వివరించారు.