Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ సదస్సులో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్
భావితరాల సుస్థిర మనుగడ కోసం ప్రతిమనిషికీ పర్యా వరణ స్పృహ ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణ ఎరుకతో, జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తూ మనుషులు తమ జీవన శైలిని తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల, తెలుగు విభాగం నిర్వహిస్తున్న 'తెలుగు సాహిత్యం-పర్యావరణ చైతన్యం' రెండు రోజుల అంతర్జా తీయ సదస్సులో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లా డుతూ.. మన పిల్లల కోసం ఎన్ని ఆస్తులు కూడ బెట్టాం అన్నది ముఖ్యం కాదు, వారు ఆరోగ్యకరంగా జీవించేందుకు నివాసయోగ్యమైన వాతావరణం కల్పిస్తు న్నామా లేదా అన్నది ప్రధానమన్నారు. ఈ రకమైన దార్శ నిక దృష్టితోనే రాష్ట్రంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33% పెంచడానికి సీఎం కేసీఆర్ 2015లో తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని సంకల్పించారని అన్నారు. 230 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ఏడేండ్లలోనే సాధించి ఇవ్వాళ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 2021 అటవీ సర్వే నివేదిక ప్రకారం గడచిన రెండు సంవత్సరాలలో దేశంలో అటవీ ప్రాంతం, పచ్చదనం పెంపు పెరిగిందని, దీనిలో రాష్ట్ర భాగస్వామ్యం గణనీj ుమని అన్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రపంచ దేశాల సరసన నిలబడిన ఏకైక నగరంగా, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఏఫ్ఏఓ) నుంచి గుర్తింపు పొందిందన్నారు. అజామ్ హాల్, గ్రంథాలయానికి త్వరలోనే పునరుద్ధరిస్తా మన్నారు. ఈ కళా శాలకు తొలిసారిగా వస్తున్నానని, డిగ్రీ అడ్మిషన్లలో సిటీ కళాశాల రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉండటం గర్వకారణమన్నారు, ఇలాంటి అపురూప కట్టడాలను కాపాడు కోవలసిన అవసరం ఉందన్నారు.రబీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, మహమ్మద్ అలీ జిన్నా ప్రసంగిం చిన అజామ్ హాల్, గొప్ప పుస్తక సంపద కలిగిన గ్రంథాలయం అన్నారు. ఈ సంపద పురా వారసత్వ వైభవాన్ని సంతరిం చుకోవ టానికి అవసరమైన అన్నీ చర్యలు సత్వరమే చేపడతామన్నారు.
సభలో మరో గౌరవ అతిథిగా పాల్గొన్న పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ వాణీ ప్రసాద్ మాట్లాడుతూ..మనిషి దురాశకు, విచ్చలవిడి తనానికి మరో నాలుగు భూగోళాలైనా సరిపోవని అన్నారు. కేంద్రం ప్రభుత్వం 'పర్యావరణం కోసం జీవన శైలి' అనే నినాదం తీసుకువచ్చిందన్నారు. డాక్టర్.మామిడి హరికృష్ణ ప్రపంచ జీవావరణ సాహిత్యాన్ని విశ్లేషించారు. పర్యావర ణవేత్త దుశర్ల సత్యనారాయణ ప్రపంచానికి చెట్టు అమ్మ వంటిదన్నారు. డాక్టర్.నాగసూరి వేణుగోపాల్ కీలకోప న్యాసం చేశారు. సభకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. ఐజాజ్ సుల్తానా అధ్యక్షత వహించారు. సదస్సు సంచాల కులు డాక్టర్.కోయి కోటేశ్వర రావు, డాక్టర్.జె.నీరజ సదస్సు సమన్వయం చేయగా సాంకేతిక సదస్సులలో ప్రజాకవులు సుద్దాల అశోక్ తేజ, జయరాజు, అంబటి వెంకన్న, భారతదేశ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుండి విచ్చే సిన ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు, కొలక లూరి ఆశా జ్యోతి, సూర్యా ధనంజరు, సాగి కమలాకర శర్మ, డాక్టర్. లక్ష్మణ్ చక్రవర్తి, డాక్టర్.సీతారాం, డాక్టర్.ఎస్.రఘు, డాక్టర్. మట్టా సంపత్ కుమార్ రెడ్డి, దోరవేటి, కస్తూరి మురళీకృష్ణ, ప్రాతాప్ కుమార్ తదితరులు సాహిత్యంలోని వివిధ ప్రక్రియ లలో పర్యావరణ చైతన్యం గురించి పత్ర సమర్పణ చేశారు.