Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్
- ఐఎస్ సదన్ సీఐటీయూ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-సంతోష్‌నగర్
కేంద్రంలో బీజేపీ వచ్చాక దేశవ్యాప్తంగా మహిళలపై, చిన్న పిల్లలపై లైంగికదాడులు, హింస పెరిగాయని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సౌత్ జిల్లా గా సీఐటీయు, ఆవాజ్, ఐద్వా మూడు సంఘాల ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ సీఐటీయు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వివక్షకు వేధింపులకు గురవు తున్నారని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు, శ్రమకు గుర్తింపు, సమాన వేతనాలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా మోసం చేస్తుందన్నారు. మహిళల పెద్ద సంఖ్యలో నిరుద్యోగంతో బాధ పెట్టడం, పనుల్లో కోత పెట్టడం, పనుల్లో మహిళల భాగస్వామ్యాన్ని అడ్డుకోవడం వంటివి చేయడం దారుణం అన్నారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎం శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. మహిళల్లో శ్రమకు తగిన గుర్తింపునివ్వాలని మహి ళలందరికీ పురుషులతో సమానంగా కనీస వేతనం చెల్లించా లన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్కీం వర్కర్ల అందరికీ గ్రాడ్యుయేటి చెల్లించా లన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని తెలిపారు. ఐద్వా కార్యదర్శి పీ శశికళ మాట్లాడుతూ.. మహిళల మీద జరుగు తున్న హింసను అరికట్టాలన్నారు. సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా హక్కులు కల్పించాలని, దాడులను తిప్పి కొట్టే విధంగా ఉద్యమాలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సీఐటీయు జిల్లా అధ్యక్షురాలు ఎం మీనా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం లక్ష్మమ్మ, రఘునందన్, స్వరూప, జ్యోతి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.