Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఏ శ్రీదేవి
నవతెలంగాణ-వనస్థలిపురం
ఉమెన్స్ జడ్జి డేను పురస్కరించుకుని జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఏ శ్రీదేవి నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలోని సఖి కేంద్రం సమావేశం మందిరంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించ ారు. ఈ అవగాహన కల్పించడానికి రంగారెడ్డి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇద్దరూ రిసోర్స్ పర్సన్‌ను.. లాయర్ శ్యామలాదేవిని, సామాజికవేత్త వషాలని లాయర్‌ను నామినేట్ చేశారు. ఈ అవగాహన సదస్సు ద్వారా మహి ళలకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు, యాసిడ్ ఎటాక్, వరకట్న వేధింపుల గురించి, లైంగికదాడులు, లైంగిక వేదింపులు, పోక్సో చట్టం గురించి తదితరాలను వివ రించారు. ఈ సమావేశంలో ఏ.శ్రీదేవి మాట్లాడుతూ సమా జంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఉచిత న్యాయ సహాయం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా అందిస్తామని, ఈ సమాచారాన్ని ప్రతీ ఒక్కరికి చేరవేయాలని, అంగన్వాడి, ఆశా, సఖి కేంద్రం వర్కర్లను కోరారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని యంత్రాంగాలు తమ సహాయ సహకారాన్ని అంది స్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆశ వర్కర్లు, అంగ న్వాడీ టీచర్లు, సీపీడీవో వర్కర్లు, సఖి సెంటర్ లీగల్ కౌన్సి లర్ గౌరీ, ఇంచార్జ్ పి సుశీల, అనిత, తేజస్విని, పారా లీగ ల్ వాలంటీర్స్, న్యాయ సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.