Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు నారాయణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాటర్‌వర్క్స్‌లో పనిచేసే కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, జీవో14 అమలు చేయాలని హెచ్ఎండ బ్ల్యూఎస్ఎస్బీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పి.నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యో గులు, కార్మికులు వాటర్‌బోర్డు కార్యాలయాకి తరలివ చ్చారు. వేతనాలు చెల్లించాలని, జీవో 14ను అమలు చేయాంటూ ఎండీ దాన కిషోర్‌ను కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందుకు స్పందించిన ఎండీ వేతనాలు పెంచేందుకు మంత్రి కేటీఆర్ సైతం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. వేతనాలు పెంపు ప్రక్రియ చివరి దశలో ఉందని అయితే బోర్డు నుంచి కొంత సమాచారం ప్రభుత్వానికి పంపాల్సి ఉందని ఎండీ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వానికి పంపు తామని హామీనిచ్చారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు పి.నారాయణ మాట్లాడారు. జీవో 14 రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో అమలవుతుండగా కేవలం వాటర్ బోర్డులో మాత్రమే అమలు కాకపోవడంతో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్న కార్మికులకు జీవో 14 ద్వారా వేత నాలు పెంచాలని స్వయంగా మంత్రి కేటీఆర్ సూచించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బీ.కిరణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ రాజరత్నం, సంతోష్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు బాలరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రామ్ చందర్, జగన్, సురేష్ బాబు, యాదగిరి, కొండలు,రహీం, ఇబ్రహీం, పాండు, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ రెడ్డి, విజయ్, మూర్తి, అనిల్, సురేష్, విగేష్, రమేష్, రైమద్, అఖిలేష్, శ్రీకాంత్, ప్రవీణ్, నర్సింహా రాజు,యుగేందర్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.