Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల విధుల్లో పాల్గొనే ఛీప్ సూపరిటెండెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపరిటెండెంట్లు, కస్టోడియన్లతో పాటు ఇతర విధులు నిర్వహించే ఉద్యోగులతో హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి. ఒడ్డెన్న శుక్రవారం నగరంలోని సరోజినీ దేవీ వనితా మహ విద్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో సంబంధిత అధికారుల విధులతో పాటు వారికి పలు సలహా లు, సూచనలు చేశారు. అనంతరం డీఐఈవో మాట్లాడుతూ విద్యార్థులు హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం లేనప్పటికీ పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలని సూచించారు. విద్యుత్, వైద్య, తపాలా, ఆర్టీసీ, పోలీసు, ఇతర జిల్లా అధికారుల సమన్వయంతో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష లు రాసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులం దరూ పరీక్ష సమయాని కంటే ముందుగానే చేరుకోని ఎలాం టి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లా పరీక్ష కమిటీ సభ్యులు ఎన్.జ్యోతి, ఎస్. ఆనంద్ కుమార్, డి.రవిచందర్, జి.లక్ష్మి, సబా పాల్గొన్నారు.