Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
సీఎం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడా లని,ప్రజల్లో చైతన్యం చేయటానికే హత్ సే హత్ జోడో యాత్ర సాగుతుందని మేయర్ చిగురింత పారిజాత నర్సిం హారెడ్డి, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డిలు అన్నారు. శుక్రవారం నియోజక వర్గంలో చేపట్టిన జోడో యాత్రలో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో ఉన్న గుర్రంగూడ గ్రామంలో ఇంటింటికీ తిరిగి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కోసం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలియ చేస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి నియంత పాలనకు సాగిస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు బాబు, దేప భాస్కర్ రెడ్డి, జంగారెడ్డి, కార్పొరేటర్ పి. సుదర్శన్ రెడ్డి,అర్.సంతోషి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నియో జక వర్గం యూత్ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, నాయ కులు నవ్వారు మల్లారెడ్డి,గుర్రం లక్ష్మారెడ్డి,చల్లా బాల్ రెడ్డి, సామిడి గోపాల్ రెడ్డి,అమత నాయుడు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.