Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్తా
నవతెలంగాణ-నాగోల్
సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి సావిత్రిబాయి ఫూలే అని రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్, ఐవీఎఫ్ జాతీయ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి పురస్కరించుకొని సరూర్నగర్ డివిజ న్లోని జింకలబాయి కాలనీ గణేష్ మండపం చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమానికి ఆయన అతిథిగా పాల్గొని సావిత్రి బాయి పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులుర్పిం చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను ,సంప్రదాయాలను ,ఆధిపత్యాలను దిక్కరించి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి బహుజనుల కు విద్యనం దించారని తెలిపారు. అట్టడుగు వర్గాలకు ,మహిళలకు చదువు సంపద వంటిదని అదేవిధంగా సమస్త హక్కులను కల్పించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని సాధించారని కొనియాడారు.అటువంటి సావిత్రి బాయి పూలే వర్ధంతి సందర్భంగా ప్రతీ ఒక్కరు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేరా బాలకిషన్ వెంకట్ గౌడ్ ,అరవింద్ కుమార్ లతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.