Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం వనస్థ లిపురం క్రిస్టియన్స్ కాలనీ లో సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి మీకు ఇవే మా జోహర్లు, అన్నారు. వారు మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే భారత దేశ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి అన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమా జాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అన్నారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివద్ధికి కషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో శౌర వృత్తిదారుల దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెన్నారం మల్లేష్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు గంధం మనోహర్, మహిళా సంఘం నాయకురాలు చంద్రమ్మ, భాగ్యమ్మ, తిరుమల, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ : చైతన్యపురి లేబర్ అడ్డా వద్ద కేవీపీఎస్ సరూర్నగర్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం మనోహర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజానికి చేసిన కృషి ఆదర్శంగా తీసుకో వాలని చెప్పారు.ఆధునిక విద్య ద్వారానే స్త్రీకి విముక్తి సాధ్యపడుతుందని అని నమ్మి తన భర్త దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని స్త్రీలు, బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు అని అన్నారు. కమిటీ సభ్యులు కృష్ణ రాములు, లక్ష్మమ్మ, సీహెచ్ మల్లేష్, సీఐటీయూ నాయకులు ఎం వీరయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్ : మన్సూరాబాద్ సహారా రోడ్డులో పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి భాయివిగ్రహానికి మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొని పూలమాలవేసి నివాళులు అర్పిం చారు. బ్యాంక్ కాలనీ అధ్యక్షురాలు సరస్వతి, పూలె యువజన సంఘం అధ్యక్షులు మేడిగ శ్రీధర్ మేరు, కార్యదర్శి శనిగరపు స్వామి, పిడికిలి రాజు, బిక్షం గౌడ్, సురేష్, కేవీ గౌడ్, మధుసూదన్ రావు తదితరులున్నారు.
సరూర్నగర్ : సరూర్ నగర్లో సావిత్రి బాయి ఫూలే విగ్రహానికి బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్య దర్శిలు బేర బాలకిషన్(బాలన్న), మురుకుంట్ల అరవింద్ శర్మ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. రామా చారి, కొండ్ర శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ రాజేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితా దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్కాజిగిరి దయానంద్, నల్లంకి ధనరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.