Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవన్ హాస్పటల్ ఎండీ డాక్టర్ దుర్గ రాణి
నవతెలంగాణ-హైదరాబాద్
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యంగా తయారయ్యిందని జీవన్ హాస్పిటల్ ఎం.డి డాక్టర్ దుర్గారాణి ( గైనకాలజిస్ట్) తెలిపారు జిల్లెలగూడలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపులో డాక్టరు దుర్గ రాణి మాట్లాడుతూ ఇప్పుడు ఆరోగ్యం అన్నది పెద్ద టాస్క్ లాగా మారిందని తెలిపారు ప్రజలు మారుతున్న కాలంతో పరిగెడుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహించడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరుఇంచారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు కరోనా వచ్చి పోయిన తర్వాత పోస్ట్ కోడ్ లక్షణాలు ప్రస్తుతం ప్రభావం చూపి స్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరంతరం తమ ఆరోగ్యాన్ని చెకప్ చేసుకోవాలని తెలిపారు ఏర్పాటుచేసిన హెల్త్ క్యాం పులో బీపీ, షుగర్, పాప్ స్మేర్ వివిధ రకాల పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసి సలహాలు సూచనలు చేశారు. ఈ డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్ నాగేష్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రోసి, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.