Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్ నగర్
ఆర్కేపురం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తా అని బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిలు మురుకుంట్ల అరవింద్ శర్మ, బేర బాలకిషన్లు అన్నారు. బ్రహ్మౌత్సవాలలో భాగంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని దేవాలయాల ను ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ దేవాలయ స్థాపన జరిగి నేటికీ 50 ఏండ్లు పూర్తయింది అని, ఈ సందర్భంగా స్వామివారికిచ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మెన్ జగిని రమేష్ గుప్తా, నాయకులు రామాచారి, కొండ శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్ ,కంచర్ల శేఖర్, రాజు శ్రీ వాస్తవ, రాజేష్, మారం సుజాత పాల్గొన్నారు.