Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకు రూ. 12 కోట్ల సైబర్దోపిడీ
- టెలిగ్రామ్ యాప్ వేదికగా నయా స్కెచ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
విలువైన గిఫ్ట్‌లు గెలుచుకున్నారని, లక్కీడ్రాలో గెలుపొందా రని, కేవైసీ, ఆధార్, ఫోన్ నెంబర్ బ్యాంక్‌కు అనుసంధానం చేసుకో వాలంటూ కొందరు సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతుం టారు. మరికొందరు స్నేహం పేరుతో లేదా పెండ్లీలు చేసుకుంటా మనో మభ్యపెట్టేవారు. ఇంకొందరు క్రెడిట్ పాయింట్స్ వచ్చాయని, మీ వస్తువులు కొనుగోలు చేస్తామనో, వ్యాపారం చేద్దామనో అందిన కాడికి దోచుకునే వారు. అమ్మాయిలతో వల వేయడం, హానిట్రాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్‌మీడియా వేదికగా అమా యకులకు గాలం వేసి లక్షల్లో కొళ్లగొట్టేవారు. బిట్‌కాయిన్, షేర్ మార్కెట్ పేరుతో రెచ్చిపోయేవారు. తాజాగా పార్ట్‌టైమ్, ట్రేడింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ భారీ మోసాలకు పాల్పడు తున్నారు. రోజుకు లక్షల్లో దోపిడీ చేస్తున్నారు.
టెలిగ్రామ్ యాప్ వేదికగా
తాజాగా కొందరు సైబర్‌నేరగాళ్లు టెలిగ్రామ్ యాప్‌ను వేది కగా చేసుకుంటున్నారు. వివిధ రకాలుగా ఆకర్షిస్తూ చివరకు లక్షల్లో ముంచుతున్నారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పోలీసులకు 10కిపైగా ఫిర్యాదలందుతుండగా నెలకు రూ. 9 నుంచి 12 కోట్ల వరకు సైబర్ దోపిడీ జరుగుతోంది. గతంలో వాట్సాప్ వేదికగా జరిగే ఈ మోసాలు ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా అధికంగా జరుగుతున్నాయి. వివిధ పద్దతులలో జరుగుతున్న ఈ మోసాలు చివరకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌గా మారిపోతున్నాయి. ఈ మోసాలకు సంబంధించిన సూత్రధారులు కొందరు విదేశీయులే ఉంటున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
తక్కువ పెట్టుబడితో మొదలు
గతంలో ఎక్కువగా వాట్సాప్‌లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్‌కు సంబంధించిన గ్రూప్‌లలో అందరిని చేర్చేవారు. బిట్‌కాయిన్ పేరుతో మోసాలకు తెరలేపారు. తాజాగా సైబర్‌నేరగాళ్లు తమ దృష్టిని టెలిగ్రామ్ వైపు మళ్లించారు. టెలిగ్రామ్‌లో సులువుగా చేరేందుకు అవకాశముండడం, ఇతరులను ఈజీగా కాంటాక్టు అయ్యేందుకు అవకాశాలుండడంతో ఇప్పుడు ఈ యాప్‌లో సైబర ్నేరగాళ్లు ఎక్కువగా అమాయకులకు వల వేస్తున్నారు. నేరం చేస్తున్న వారు తప్పించుకునేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో దీనిని వేదికగా చేసుకుంటున్నారు. వీలైనంత మందిని ఈ గ్రూపులలో చేర్చు వివిధ రకాల చర్చలు జరుపుతున్నారు. వాటిని చూసిన కొందరు ఆకర్షితులవుండగా, మరికొన్ని సంద ర్భాలలో సైబర్‌నేరగాళ్లు పంపించే లింక్‌లను బాధితులు క్లిక్ చేసి గ్రూపులో చేరుతున్నారు. వారు తెలియకుండానే గ్రూప్‌లలో జరిగే చర్చలకు ఆకర్షితులవుతున్నారు. మొదట తక్కువ మొత్తంలో పెట్టు బడి పెట్టిస్తూ, ఆ తరువాత లక్షల రూపాయలు వివిధ టాస్క్‌ల పేరుతో పెట్టుబడి పెట్టించి మోసాలు చేస్తున్నారు. ప్రస్తుతం జంట పోలీస్ కమిషనరేట్లలలో నమోదువుతున్న ఆర్ధిక పరమైన సైబర్ నేరాలలో 40 శాతం ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన మో సాలే ఉంటున్నాయి. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీ సులు సూచించారు. ఎవరైనా ఆర్థిక పరమైన విషయాలు చర్చిస్తే వారిని నమ్మొద్దని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ అధికారులు ఎవరూ ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీల వివరాలను అడగరని స్పష్టం చేశారు.