Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో నివాళి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ప్రారంభ సూచికగా ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు రాఘవ రావు, పజాతంత్ర ఉద్యమ నాయకులు జి శ్రీనివాస్.. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. గొడుగు యాదగిరి రావు మాట్లాడుతూ ఆనాడు శూద్రులకు చదువు నిరాకరిం చబడిన కాలంలో సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యాబో ధన చేయటం కోసం పాఠశాలను ప్రారంభించారని తెలిపా రు. మనువాద దుర్మార్గాలను ఎదుర్కొని విద్యాబోధన చేశారన్నారు. జి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనాడు సావిత్రిబా యి పూలే మీద పేడ నీళ్లు, బురద నీళ్లు వేసినప్పటికీ తన బ్యాగులో మరొక చీరను తీసుకొని వెళ్లి, దుర్గంధమైన వస్త్రాలను మార్చుకొని తీసుకొచ్చిన బట్టలతో చదువులు చెప్పేవారని, రకరకాల దాడులు చేసిన ఎదురొడ్డి నిలిచారని అన్నారు.సామాజిక కార్యకర్త వెంకట్ మాట్లాడుతూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగానే కాకుండా ఇంగ్లీషులో కవితలు వ్యాసాలు రాసిన ఘనత వారికే దక్కిందని అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి ని ప్రధమ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని అనేక ప్రజాతంత్ర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. ప్రముఖ విజ్ఞాన వేత్త ఈ నాగయ్య మాట్లాడుతూ సమాజంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సుదీర్ఘకాలం బడుగు బలహీన వర్గాలకు చదువు లేకుండా చేసిన సనాతన వాదులకు దీటుగా జవాబు చెబుతూ ఆనాడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ప్రజలకు చదువులు చెప్పి సరైన సమాధానం ఇచ్చారని చెప్పారు. ఆనాడు ప్రజలు ప్లేగు వ్యాధితో బాధపడుతూ పిట్టల్లా చనిపోయే వారిని, వారికి సేవ చేయటంలో సావిత్రిబాయి పూలే ముందున్నారని చెప్పారు. చివరికి అదే వ్యాధితో చనిపోయారని చెప్పారు. నేటి పాలకులు తిరిగి మనువాదాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారని, వాటికి వ్యతిరేకంగా పోరాడి ప్రజల్ని సమీకరించడమే నేటి కర్తవ్యం అని అదే వారికి నిజమైన నివాళి అని అన్నారు. కోమటి రవి, శ్రీమన్నారాయణ , శోభ, గౌస్య , శ్రీనివాస రావు , సోమయా చారి , ఎర్రం శ్రీనివాస్ , సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.