Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
నాలా అయినా మోరి అయినా కన్నేస్తే కతమే.. రాత్రికి రాత్రి పూడిపేస్తారు ఆక్రమించు కుంటారు. అంతా మాదే అంటారు. ఇది నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై వస్తున్న ఆరోప ణలు. గతంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై సిం గం చెరువు తండా ప్రధాన నాలాను మింగేసి పాఠశాలలో కలిపేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. చెట్లు పెట్టారు గ్రీన్ ఫీల్డ్ ఏరియా అంటూ సాకులు చెప్పారు.. నేడు టెలిఫోన్ ఎక్సైజ్ నుంచి దుర్గా నగర్ కు వెళ్లే ప్రధాన రహదారి పాఠశాల గేటు పక్కనే ఉన్న నాలా మోరిని కూల్చారు... అదును చూసి మట్టి పోసి అది కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పేరుకు పెద్ద స్కూల్ అయినా.. తెరవెనకాల అన్ని ఆక్రమణలే..? అన్న చందంగా ఉంది నాచా రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వ్యవహారం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో నాలాపూడ్చి అనేక విమర్శల పాలైన పాఠశాల యాజమాన్యం మరొకసారి మోరిని కూల్చి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మారు తోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కూల్చిన మోరిపై విచారణ చేపట్టి పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో స్పందించి మోరి స్థలాన్ని కాపాడకపోతే వర్షాకాలంలో దుర్గా నగర్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికుడు పొన్నాల రాజన్న వాపోతున్నారు. ఏ మేరకు అధికారులు స్పందిస్తారో..? లేక నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి లాభం చేకూర్చుతారో వేచి చూడాలి..!