Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్
నవతెలంగాణ-జవహర్ నగర్
చదువుల తల్లి సావిత్రిబాయిపూలే అని, స్త్రీల విద్యాభి వృద్ధి హక్కులకై పోరాడిన మహనీయురాలని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సావిత్రిబాయిపూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం కార్పొరేషన్ లో ఆమె చిత్రపాటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఆడపిల్లల చదువుల కోసం ఆమె కషి వెలకట్టలేనిదని, సమాజంలో నెలకొన్న రుగ్మతులను రూపుమాపడానికి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. సావిత్రిబాయిని నేటి యువత ఆదర్శంగా తీసు కుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు మహేశ్, శ్రీనాథ్, నాగరాణి, సవితాగౌడ్, మౌనికరెడ్డి, వనిత, మౌనిక, శ్యామల పాల్గొన్నారు.
ఎస్ఓఎఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాని ఎస్ఎప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ హాజర య్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభు త్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిం దన్నారు. మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.