Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి మెగా మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించుకుని, ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ చర్లపల్లి డివిజన్ పరిధిలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ రాగిడి లక్ష్మారెడ్డి, ట్రస్ట్ సభ్యులు విచ్చేసి 30 మందికి మందులు, అలాగే 200 మందికి కంటి అద్దాలను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మెన్ రాగిడి లక్ష్మారెడ్డి సహాయ సహకారాలతో ట్రస్టు ద్వారా గత 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కంటి ఆపరేషన్లు, కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం, పేద మహిళలకు ఉపాధి లక్ష్యంగా కుట్టు మిషన్లు, అల్లికలు ఎంబ్రాయిడరీ వర్క్ శిక్షణ,ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పన కల్పించామన్నారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉధృతంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోశయ్య, వెంకట్ గౌడ్ , ముస్తక్ హైమద్, ముత్యాలు, సోమేశ్వర రావు, పర్సురావు యాదవ్, మహేష్ ,ప్రకాష్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్, యూత్ కాంగ్రెస్ ఉప్పల్ అసెంబ్లీ సెక్రెటరీ బోల్లు వెంకట్, నిమ్మ సురేందర్ రెడ్డి , శ్రవణ్ కుమార్, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.