Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య
నవతెలంగాణ-జవహర్నగర్
సమానత్వంతోనే మహిళలకు నిజమైన స్వాతంత్రం లభిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మేయర్ మేకల కావ్య అన్నారు. ఆదివారం జవహర్ నగర్ కార్పొరేషన్ లోని 27వ డివిజన్ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ హాజరై మాట్లాడుతూ గతంలో మహిళలకు చదువు ఎందుకులే అనే మాటలు వినబడేవని.. నేడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసిందని.. ప్రతీ ఆడబిడ్డను ఉన్నత చదువులు చదువుకునేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. మహిళలు ప్రతి రంగంలో మగ వారితో సమానంగా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆడవారు ప్రతి అవశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నతస్థితికి చేరుతారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి, తెలంగాణ ఉద్యమ కారుడు పరుశురాం, యూత్ నాయకులు ప్రణీత్, దిలీప్, జాహంగీర్, కుమార్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు వీణా, స్వప్న, క్రిష్ణవేణి, కమలా, ఉమా, మంగ, సుభద్ర, కుమారి, సంగీతా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.