Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
- దమ్మాయిగూడలో పర్యటించిన మంత్రి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రూ. 3 కోట్ల తో కాలనీ ల సమస్య పరిష్కరిస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయి గూడ మున్సిపాల్టీ పరిధిలోని అహ్మద్ గూడ 4వ వార్డులో, స్థానిక కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి పర్యటించారు. గతంలో వరదల వల్ల తీవ్రంగా మునిగిపోయి, వరద ముప్పు కలిగిన బాలాజీ నగర్ కాలనీని మంత్రి పర్యవేక్షించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజులలో వర్షాల వలన రాంకీ సంస్థ ద్వారా విడుదలయ్యే లిచిడ్ వాటర్ ద్వారా కాలనీకి ఎంతో ముప్పు ప్రమాదం పోంచి ఉందని, గమనించి మూడు కోట్ల రూపాయల వ్యయంతో బాలాజీ నగర్ కాలనీ సమస్యను పరిష్కరించి, కాలనీ ప్రజలను కాపాడు కుంటానని మంత్రి హామీ ఇచ్చారు. . ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మెన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్ స్థానిక అధ్యక్షులు తిరుపతిరెడ్డి, యూత్ అధ్యక్షులు మణికంఠ, కౌన్సిలర్లు నాను నాయక్, సుజాత, నరసింహ రెడ్డి, రమేష్ గౌడ్, సంపన్న బోలు హరి గౌడ్, 4వ వార్డు అధ్యక్షులు బాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి రాజ్ రాథోడ్, యూత్ అధ్యక్షులు నగేష్ గౌడ్, మహిళా సెల్ ప్రెసిడెంట్ లావణ్య, పద్మక్క పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసి మంత్రి
జవహర్నగర్ : పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసానిస్తుందని, కార్పొరేట్ స్థాయి వైద్యం అందు తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతీ పల్లెకు, బస్తీకి వైద్యం అందుతుందంటే ఈ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కు తుందని జవహర్నగర్ కార్పొరేషన్ 17 వ డివిజన్ కు చెందిన మురుగన్ అనారోగ్యానికి గురికాగా స్థానిక కార్పొ రేటర్ అళగిరి చిత్ర సుబ్రహ్మణ్యం సహకారంతో సీఎం సహా యనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.30 వేలు మంజూ రయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును బాధితుడికి ఆదివారం మంత్రి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న గొప్ప మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ 17 డివిజన్ నాయకుడు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.