Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ ప్రజలందరూ మద్దతుగా ఉండాలని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఆదివారం కంటోన్మెంట్ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్లో బోర్డు మాజీ ఉపాద్యాక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆద్యర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారం భించారు. అనంతరం విజేతలకు బహుమతులు, పాల్గొన్న మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా దినోత్సవ వారోత్సవాలను సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారని అయితే కేంద్ర ప్రభుత్వం మహిళలని కూడా చూడకుండా కూడా జాగతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను అనవసరంగా వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అంతకు ముందు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను అమోఘమైనవని చెప్పారు అంతేకాకుండా కంటోన్మెంట్ బోర్డ్ ప్రాంతంలో తాను కూడా అనేక గ్రూపుల ఏర్పాటు చేసి మహిళలకు సమయం ఉపాధికి పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించానని చెప్పారు. కార్యక్ర మంలో బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, ప్రభాకర్, బీఆర్ ఎస్ నాయకులు ముప్పిడి మధుకర్, మహిళలు, జక్కుల రూప రెడ్డి, పద్మ మంజుల, అంబికా, భాగ్య, మేరీ, పార్వ తి, సబితా, జయ, అనిత, మొదలుగు వారు పాల్గొన్నారు.