Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు
- అత్యంత అధునాతన, రోబోటిక్ 'ప్యాంక్రియాటిక్ సర్జరీస్' పై
యశోద ఆస్పత్రి జాతీయ సదస్సు
నవతెలంగాణ-బేగంపేట్
దేశం నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల భాగస్వామ్యంతో అత్యంత అధునాతన, రోబోటిక్ ''ప్యాంక్రియాటిక్ సర్జరీస్''పై యశోద హాస్పిటల్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ లైవ్ వర్క్‌షాప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. యశోద హాస్పిటల్స్, ఇండియన్ హెపాటో-ప్యాంక్రి యాటో-బిలియరీ సర్జన్స్ అసోసియేషన్ (ఐహెచ్‌పీబీఏ) సహకారంతో ప్యాంక్రియాటిక్ సర్జరీలపై రెండు రోజుల జాతీయ సదస్సును యశోద హాస్పిటల్స్- హైటెక్ సిటీలో నిర్వహించారు. ఈ సందర్బంగా యశోద గ్రూప్ హాస్పిటల్స్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం దాదాపు 1.4 మిలియన్ల మంది ప్యాంక్రి యాటిక్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారిలో చాలా మందికి వ్యాధి నయం కావడానికి చాలా ఆలస్యంగా నిర్ధారణ అవుతుందన్నారు. రోగనిర్ధారణ తర్వాత 10 శాతం కంటే తక్కువ మంది రోగులు ఐదు సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారని తెలిపారు. పొగాకు ధూమపానం, అధిక ఆల్కహాల్ వినియోగం, ఊబకాయం వంటి జీవనశైలి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కారణం అన్నారు. 50 సంవ త్సరాల లోపు పురుషలు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నట్టు చెప్పారు. ''ప్యాంక్రియాస్'' మన మానవ జీర్ణవ్యవస్థలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన అవయవాలలో ఒకటని.. ప్యాంక్రియాస్ వ్యాధులు వైవిధ్య మైనవి, సంక్లిష్టమైనవి, విస్తతమైనవి అని తెలిపారు. ముఖ్యంగా ప్యాంక్రియాస్ వ్యాధుల వైద్య నిర్వహణ చాలా కష్టమన్నారు. ప్యాంక్రియాస్ శస్త్రచికిత్స అనేది శస్త్రచిక ిత్సలలో అత్యంత సంక్లిష్టమైనదని చెప్పారు. అత్యంత అనుభవం, నైపుణ్యం కలిగిన సర్జన్లు మాత్రమే ఈ శస్త్రచి కిత్సలు చేయగలుగుతారని, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు ఇతర ప్యాంక్రియాటిక్ వ్యాధులకు ల్యాప్రోస్కోపిక్, ఇటీవల రోబోటిక్ సర్జరీల వంటి మినిమల్ ఇన్వేసివ్ విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 500 మందికి పైగా ప్రాక్టీస్ సర్జన్లు, ప్యాంక్రియాస్ వైద్య రంగంలో దేశవ్యా ప్తంగా ఉన్న సుమారు 20 మంది ప్రముఖ జాతీయ ప్యాంక్రి యాస్ వైద్య నిపుణులతో ప్యాంక్రియాటిక్ వ్యాధుల పూర్తి స్పెక్ట్రమ్ పై చర్చించడంతోపాటు అన్ని రకాల ప్యాంక్రి యాటిక్ సర్జరీలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే ఈ తరహా సదస్సు ఇదే తొలిసారి అన్నారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలోని సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మినిమల్ యాక్సెస్ అండ్ రోబోటిక్ సర్జన్,డాక్టర్. విజయకుమార్ బడా, మాట్లాడుతూ ప్యాంక్రియాస్ తో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రి యాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ సిస్ట్ సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటిన్నారు. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో 100,000 జనాభాలో 200 మంది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ బారిన పడుతున్నారని అన్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ప్రపంచంలో 4వ స్థానం లో, మరణాలలో 7వ స్థానంలో ఉందన్నారు. ఇది 2030 నాటికి మరణాలలో రెండవ స్థానానికి చేరవచ్చని అన్నారు. ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సరికొత్త తరం రోబోటిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్యాంక్రి యాటిక్ సర్జరీలు చేయడానికి, ప్రధాన ప్యాంక్రియాటిక్ సర్జరీలలో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి చాలా మంది యువ సర్జన్లకు సరైన వేదిక లేదన్నారు. ఐహెచ్‌పీబీఏ అనేది భారతదేశం అంతటా కాలేయం, ప్యాంక్రియాస్ సంబంధిత వైద్య విధానం సర్జన్లందరి జాతీయ సంఘం అని తెలిపారు.