Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కేంద్రాలకు తరలివెళ్లిన అధికారులు
- డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పరిస్థితులను
సమీక్షించిన కలెక్టర్ అమోరు కుమార్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న సోమ వారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఎన్నికల కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం శామీర్‌పేట్‌లోని కలెక్టరేట్ ఆవర ణలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడెంగ్, మైక్రోఅబ్జర్వర్లు, ఓపీవో, ఎన్నికల సిబ్బందికి అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలతో పాటు సిరా వంటి ఇతరత్రా ఎన్నికల సామాగ్రిని అందచేశారు. వారికి ప్రత్యేక వాహనంలో పోలీసు బందోబస్తు కల్పించగా ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిబ్బంది తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో కీసరలో 8, మల్కాజిగిరిలో 6 ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,536 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లు 3,498, పురుష ఓటర్లు 3,038 మంది ఉన్నారు. అలాగే ఎన్నికలు జరిగే అన్ని చోట్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ అమోరు కుమార్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సరూర్‌నగర్‌లోని స్టేడియంకు తరలించి అక్కడ భద్రపర్చడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు, ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు.