Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ ఆయన సతీమణి విద్యావతి తో కలిసి తాడ్‌బండ్‌లో స్థానికుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అరుంధతి హాస్పిటల్ సహకారంతో తాడ్‌బండ్‌లో ఏర్పాటుచేసిన ఈ ఉచిత వైద్య శిబి రాన్ని బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్ని రకాల వైద్య పరీక్షలు అరుంధతి హాస్పిటల్లో ఉచితంగా చేయించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. అంతే కాకుండా కంటోన్మెంట్ ప్రజలు శ్రేయస్సుకు అహర్నిశలు కషి చేస్తున్నారని పాండు యాదవ్‌ను అభినందించారు. చాలామంది ప్రయివేటు ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో అయ్యే బిల్లు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటువంటి పేద వారిని దష్టిలో పెట్టుకొని ఇప్పటికే అరుంధతి హాస్పిటల్ ''గిఫ్ట్ ఏ స్మైల్ '' కింద దాదాపుగా 2000 పై చిలుకు శస్త్ర చికిత్సలు పూర్తిగా ఉచితం గా చేశారని చెప్పారు ఇకముందు కూడా ఉచితంగా అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, నేతలు ముప్పిడి మధుకర్ ప్రవీణ్ యాదవ్ , జీనా , సురేష్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.