Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ
- సీపీఐ సికింద్రాబాద్ మూడో మహా సభ
నవతెలంగాణ-ఓయూ
బలమైన పోరాటాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కా రం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఈటి నరసింహ అన్నారు. సీపీఐ సికింద్రాబాద్ మూడో మహాసభ ఆదివారం లాలపేటలోని నఫీజ్ గార్డెన్ లో సీపీఐ సికింద్రాబాద్ కన్వీనర్ కాంపల్లి శ్రీనివాస్ అధ్యక్ష తన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయ కులు కామ్రేడ్ రాజేశ్వరమ్మ పతాకావిష్కరణ చేశారు. అనం తరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ మరిన్ని పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలబడాలన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతి థిగా విచ్చేసిన కామ్రేడ్ ఈటీ నరసింహ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే ఏకైక మార్గమని, అట్టడుగు వర్గాల ప్రజల కోసం నిరంతరం ఉద్యమించేది కేవలం ఎర్రజెండాలని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంపాదను కొల్లగొడుతూ.. ఆదానీ, అంబానీలకు దోచిపెడుతూ.. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ జాతి సంపదనంతా విధ్వంసం చేస్తున్నారని తెలిపారు. మరోపక్క అచ్చేదిన్ అంటూ నిత్యవసర ధరలను రోజు రోజుకు ఆకాశానికి ఎత్తేస్తూ సామాన్య ప్రజల బతుకులను దుర్భరం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ప్రశ్నించే ప్రతిపక్షాల పైన ఈడీలను, సీబీఐలను, ఉసిగొలుపుతూ దాడులు నిర్వహిస్తూ ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగ పరుస్తాన్నారన్నారు. మరోవైపు దేశంలో ప్రశ్నించే గొం తుకల, మేధావులు, కవులు రచయితల పైన అక్రమ కేసులు బనాయిస్తూ జైలలో నిర్బంధిస్తున్నారని ఇది ప్రజాస్వా మ్యానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత రాజ్యాంగ పరిరక్షణ ఏకైక మార్గమని కావున కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల ను చైతన్య పరుస్తూ పార్టీ బలోపేతానికి కషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు స్టాలిన్, కమ టం యాదగిరి, ఉమర్ఖాన్, కొమరెల్లి బాబు, పాకాల యాద గిరి, సోమయ్య, శంకరమ్మ, చెట్టు కింద శ్రీనివాస్,ఎస్కే లతీఫ్, మహమ్మద్, గువ్వల మల్లేష్, చారి, గౌరీ నాగరాజు, శంక రయ్య, కాజా, వెంకటలక్ష్మి, బాల మనమ్మ పాల్గొన్నారు.