Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మేరు సంఘం జేఏసీ
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
రాష్ట్ర మేరు సంఘం పరిపాలన సంఘం నియమా వళికి, నిబంధనలకు విరుద్ధంగా ఉందని, కొంతమంది గత 11 సంవత్సరాలుగా రాష్ట్ర మేరు ప్రజలను, రాష్ట్ర మేరు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి అధికార దుర్వినియోగానికి పాల్ప డుతున్నారని రాష్ట్ర మేరు సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. ఆదివారం హనుమాన్ టెక్ని లోని బీసీ సాధికారిత భవన్లో రాష్ట్ర మేరు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మునిగాల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ సభ్యులు మాట్లాడుతూ వ్యక్తిగత పగలతో ప్రతికారాలతో అధికారమే పరమవ్య వధిగా వ్యవహరిస్తూ వివిధ రకాల కారణాలతో 11 ఏండ్లుగా రాష్ట్ర మేరు సంఘాన్ని, రాష్ట్ర మేరు ప్రజల సంక్షే మాన్ని సర్వనాశనం చేశారని దీనికి అందరూ బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్ర మేరు మేధావులు, యువత, పెద్దలు తప్పును తప్పూ, ఒప్పును ఒప్పూ.. అని సూటిగా ప్రశ్నించకపోవడం వలన రాష్ట్రమేరు సంఘంలో ఈ పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. రాష్ట్ర మేరు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మేరు సంఘం పెద్దల మధ్య చాలాసార్లు సయోధ్య చేయడానికి పలుమార్లు సమావేశమై చర్చించినా కొంతమంది వ్యక్తిగత పగలు ప్రతికారులతో ఆ సమావేశాల ఫలితాలను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఇప్పటికైనా వ్యక్తిగత విభేదాలు పక్కకు పెట్టి రాష్ట్ర మేరు ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రమేరు సంఘం,జిల్లా, నియోజక వర్గ, మండలాల ఎన్నికలు నిర్వహించాలని కోరా రు. అందరూ బంధువులు ఎగతాటిపై వచ్చి కుల అభివద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మేరు జేఏసీని వివిధ జిల్లాలకు మండలాల్లో విస్తరించి రాష్ట్ర మేరు సం ఘంలో జరుగుతున్న అధికార దుర్వినియోగాన్ని నియమ నిబంధనల దుర్వినియోగాన్ని ఎండగట్టే పని చేస్తుందని హెచ్చరించారు. అందరూ కలిసికట్టుగా ఒక సమావేశం ఏర్పాటు చేసి తొందరగా ఎన్నికలు నిర్వహించాలని దానికి రాష్ట్రమేరు సంఘంకు జేఏసీ పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో వివిధ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సంగ వెంకటరాజం, వెన్ను లింబాద్రి, ఎంపడి పాండు, సింగ్ విష్ణు, బొలకొండ రవితేజ, దీకొండ ప్రకాష్, మంతెన దామోదర్, నోముల శాంతి కుమార్, గంగాపురం మహేష్, పవన్ కుమార్, వేణు,అక్కు రాజేందర్ మొదలగు పాల్గొన్నారు.