Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16న ఓయూ ఈత కొలను పున: ప్రారంభం
- పూర్తయిన ఏర్పాట్లు
- మొదలైన దరఖాస్తుల పక్రియ
- ఫిట్‌నెస్‌కు ఈత అవసరం : డెరైక్టర్ ప్రో.రాజేష్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్విమింగ్ పూల్ (ఈత కొలను) సేవలను ఈ నెల 16న పున: ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఓయూ డెరైక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ప్రో.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈత కొట్టాలంటే ఫీజులు చెల్లించాల్సిందే.. మొదలైన దరఖాస్తు పక్రియ
స్విమ్మింగ్ పూల్ సేవలను యూజర్ చార్జీలను ఈ విధంగా నిర్ణయించారు. ఓయూ విద్యార్థులకు రూ. 100, ఓయూ ఉద్యోగు లకు రూ. 750, ఇతరులకు రూ 2000, అప్లయిడ్ కళాశాలల వారు రూ 750గా నిర్ణయించారు. ఇప్పటికే ఓయు స్విమింగ్ ఫూల్లో దరఖాస్తులు గత మూడు రోజుల నుండి అందజేస్తున్నారు. ఇక ఫీజు ను ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. రూ. 100 చెల్లించి దరఖాస్తు ఫారం ను పొందాల్సి ఉంటుంది.
ప్రత్యేక రక్షణ చర్యలు,నిబంధనలు ఇవే..
ఇక ఇక్కడ వచ్చే వారు స్విమ్మింగ్ డ్రస్‌తో రావాలి. వచ్చే ముందు స్నానం చేసి రావాలి. తప్పనిసరి గా డాక్టర్స్ చేత మెడికల్ సర్టిఫికేట్ ను దరఖాస్తుకు జత చేయాలి. ఆస్తమా, ఫిట్స్ ఉన్నవారిని, 7 సంవత్సరాల లోపు పిల్లలను అనుమతించరు. ఇక ఈత రాని వారు 4 ఫీట్ల లోతులోనే స్విమ్మింగ్ చేయాల్సి ఉంది. ప్రమాదం జరగకుండా ముందే ఐదుగురు లైఫ్ గార్డ్స్ ను, ఒక మహిళ, ఒక పురుషు కోచ్‌లను అందుబాటులో ఉంటారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమింగ్ ఫుల్..
స్విమింగ్ ఫూల్ పొడవు 50 మీటర్లు, వెడల్పు 25 మీటర్లు, లోతు 4 నుంచి 7 ఫిట్లు ఉండే ఈ స్విమింగ్ ఫూల్ 20 లక్షల టీ నీటి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఈత కొలనును అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిబంధనలతో నిర్వహించనున్నారు. 24 గంటల పాటు పూల్ ఫిల్టరేషన్ చేస్తారు, లిక్విడ్ హై ఫ్లో క్లోరైడ్ టీసీసీ 90 ఏ కెమికల్ వినియోగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే వారికి సంరక్షణ కు,ఆరోగ్యానికి,పెద్ద పీట వేశారు.
స్విమింగ్ ఫూల్ సమయాలు
ఉదయం..బ్యాచ్‌లు
1వ బ్యాచ్ ఉదయం 6 నుంచి 6:40 వరకు
2వ బ్యాచ్ 6: 45 నుంచి 7:25
3వ బ్యాచ్ 7:30 నుంచి 8:10
4వ బ్యాచ్ 8:15 నుంచి 8:55
ఇక మహిళలకు 5వ బ్యాచ్‌ను కేటాయించారు. వారికి 9:20 నుంచి 10 గంటల వరకు ఉంటుంది.
సాయంత్రం బ్యాచ్‌లు
6వ బ్యాచ్ 3:30 నుంచి 4:10 వరకు
7వ బ్యాచ్ 4:15 నుంచి 4:55 వరకు ,
8వ బ్యాచ్ 5:00 నుంచి 5:40 వరకు
ఇలా ప్రతీ బ్యాచ్‌కు 40 నిమిషాల సమయం కేటాయించారు.
ఆత్మ రక్షణ, సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈత
ఈత సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడు తుంది. వేసవి కాలంలో విద్యార్థులకు పెద్దలకు ఒక ఫిజికల్ ఎక్సర్సైజు. ఈత ఫిట్నెస్ను వద్ధి చేస్తుం ది. అందరూ ఈత నేర్చుకొని ఉంటే మంచిది.అంతర్జాతీయ ప్రమా ణాలతో ఈ ఫూల్ రన్ చేస్తున్నాము. అన్ని రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాము.
- ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ప్రో.రాజేష్ కుమార్