Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని ఎంపీ ఆర్ కష్ణయ్య, ఎమ్మెల్సీ ఎల్ రమణలు అన్నారు, పెద్ద అంబర్పేట మున్సిపాల్టీ పరిధిలోని సత్యం టెక్నో స్కూల్ చైర్మెన్ గుజ్జ సత్యం, ప్రిన్సిపల్ అరవింద్ బాబుల ఆధ్వర్యంలో జరిగిన పాఠశాల 12వ వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అందుకోసం వారి తల్లిదండ్రులు కూడా పూర్తిగా సహకరించాలని సూచించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను చిన్నతనంలోనే ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులు గుర్తించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో నైపుణ్యత సంపాదించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు ఏర్పాటుచేసిన జ్యోతి ప్రజ్వ లన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల చైర్మెన్ సత్యం, ప్రిన్సిపాల్ అరవిందు బాబులు మాట్లాడారు. సత్యం టెక్నో స్కూల్ ఈ స్థాయికి రావడానికి, తమ అభివృ ద్ధికి సహకరిస్తున్న అందరికీ, విద్యార్థులకు వారి తల్లిదం డ్రులకు తాము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా మన్నారు. రానున్న రోజులలో విద్యార్థులకు పలు పోటీ కార్యక్రమాలు రూపొందిస్తూ విద్యార్థులు ప్రతిభను కనబరిచేలా చేస్తామ న్నారు. అదేవిధంగా విద్యార్థులకు విద్యానందించడంలో తమ స్కూలుకు ప్రత్యేకత ఉందని నిరూపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకురాలు విమలక్క, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యం, రాష్ట్ర కన్వీనర్ లాల్ కష్ణ, టీపీసీసీ కార్యదర్శి దండం రామ్ రెడ్డి, కౌన్సిలర్లు కష్ణారెడ్డి, రాజేందర్, నాయకులు కోలా జనార్దన్, మల్లేష్, రామలింగం, సురేష్, పాండరీనాథ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు