Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
గోల్నాక డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ మేయర్ గద్వాల విజయలక్ష్మికి గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గోల్నాక డివిజ న్లో ఇప్పటివరకు ప్రారంభోత్సవం చేసిన చాలా సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. రోడ్లు కొన్ని చోట్ల తొవ్వి వేయడంతో ప్రజలకు చాలా ఇబ్బం దులు కలుగుతు న్నాయని చెప్పారు. చాలా సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని, అదేవిధంగా గోల్నాక పాత బ్రిడ్జి పైన సైడ్ వాల్, గ్రీనరీ అభివృద్ధికి సంబంధించి పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. బస్తీలలో, కాలనీలలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. వాటికి సంబంధించిన బడ్జెట్ ఇచ్చి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన మేయర్.. సీసీ రోడ్లకు సంబంధించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటి పైన కాంట్రా క్టర్లను పిలిచి వారి నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని, ఇతరులకు కాంట్రాక్టులు ఇచ్చి సమస్యను పరిష్కరిం చాలన్నారు. సీసీ రోడ్లు గాని ఇతర అభివృద్ధి పైన ఎప్పటి కప్పుడు నివేదికలు తయారుచేసి అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.