Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు రుద్రకుమార్
నవతెలంగాణ-బడంగ్పేట్
మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ కార్మిక సంఘం నిరంతరం ఎంతో కషి చేస్తుందని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు రుద్రకుమార్ అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బడంగ్పేట్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అవరణంలో బాలాపూర్ మండల సీఐటీయూ నాయకులు దాసరి బాబు అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పాలన చేస్తున్నారని మండి పడ్డారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్మికులకు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు ఏవిధంగా వేతనాలు 21వేల రూపాయల వేతనాలు చెల్లిస్తున్నారో, అదే విధంగా మున్సిపాలిటీ కార్మికులందరికీి వేతనాలు చెల్లం చాలని, అదేవిధంగా 6లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే మున్సిపల్ కార్మికులందరికీ సంవత్సర కాలం గడుస్తున్నా డ్రెస్సులు, చీరలు, చెప్పులు, సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తూన్నారని, ప్రధానంగా ఎండలు తీవ్రంగా పెరిగినందున మున్సిపల్ కార్మికులందరికీ ఒకేపూట పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అధికారుల వేధింపులు అరికట్టాలన్నారు. సమావేశం అనంతరం బడంగ్పేట్ ఓల్డ్ విలేజ్ చౌరస్తాలో కార్మికులు సమస్యల పరిష్కారం కోసం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీఐటీయూ కన్వీనర్ జే. పెంటయ్య, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కే.రాములు, కే.యాదయ్య, మంగమ్మ, విజయలక్ష్మి, ధనలక్ష్మి, సుమలత, జంగమ్మ, జయమ్మ, అమత తదితరులు పాల్గొన్నారు.