Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజలకు తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటానని మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు అన్నారు. ఆదివారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ రోడ్ నెం.09లో గత కొంత కాలంగా లో ఫ్రెషర్ కారణంగా నీరు తక్కువగా వస్తుండడంతో కాలనీ వాసులు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, కార్పొరేటర్ పగుడాల శిరీషల దష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించి నూతన పైపులైన్ల కోసం నిధులు మంజూరు చేశారు. అట్టి పనులను ఆదివారం మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు పాల్గొని ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండ త్వరితగతిన పూర్తిచేయాల న్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస కాలనీ ప్రెసిడెంట్ భూమండ్ల అశోక్, కాలనీ వారు తదితరులు పాల్గొన్నారు.