Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివద్ధి పనులకు ఆకర్షతులై స్థానిక కాలనీవాసులు రాజేష్ ఆధ్వర్యంలో 30మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అందించే కషి చేయాలి అన్నారు. అభివద్ధి పనులు చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, 11,7, 14వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామకష్ణ, మంజునాథ్, బొబ్బ శీను, నాయకులు సాయి ముదిరాజ్, యువకులు రాజేష్ మరియు వారి బందం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.