Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్నిచోట్ల నీళ్లు లేక.. ఇంకొన్ని చోట్ల అగ్నికి ఆహుతి..
- మా వద్ద నిధులు లేవు.. హెచ్ఎండీఏ వారే తిరిగి బాధ్యతలు స్వీకరించాలి : ఓయూ గ్రీన్ బెల్ట్ డైరెక్టర్ డా.శ్రీనివాసులు
నవతెలంగాణ-ఓయూ
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఓయూలో అధికారుల అలసత్వంతో నీరుగారి పోతుంది. ఓయూలో నాటిన మొక్కలను చూసుకునే వారు లేక అవి ఎండిపోతుండగా.. ఇంకొన్ని అగ్నికి ఆహుతవుతున్న దుస్థితి నెలకొంది. 2019 సంవత్సరం ఓయూకు ఇన్చార్జి వీసీ గా ఉన్న కమిషన్ ఐఏఎస్అర్వింద్ కుమార్ ఓయూలో పలుమార్లు పర్యటించి హరితహారం కార్యక్రమంలో భాగంగా ఓయూలో విరిగా మొక్కలు నాటాలని సూచించారు.దాంతో హెచ్ఎండీఏ వారు మొక్కల నాటడమే కాకుండా వాటిని సంరక్షణ బాధ్యతను తీసుకొని ఈ ఆగస్టు వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పర్యy ేక్షించారు. అనంతరం ఓయూలో కొద్దీ మంది అధికారులకు వీటి సంరక్షణకై బాధ్యతలు అప్పగించారు. అయితే వారు మొక్కల సంరక్షణ బాధ్యతను మరిచిపోవడంతో అవి ఎండిపోవడం జరుగు తోంది. ఇప్పటికైనా మొక్కల సంరక్షణ పట్టించుకోవాలని సంఘాల జాక్ చైర్మెన్ వేల్పుల సంజరు, పూర్వ విద్యార్థి టీపీసీసీ రాష్ట్ర నేత వరంగల్ రవి, ఓయూ పర్యావరణ వేత్త విజరు నాయక్‌లు కోరుతున్నారు.
కరోనా సమయంలో కూడా కంటికి రెప్పలా.. కానీ నేడు..?
కరోనా సమయంలో కూడా హెచ్ఎండీఏ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ హరితహారం మొక్కలను సంరక్షించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట '' హెడ్జ్ మొక్కలు '' కూడా నాటారు. అవి ఎంతో ఏపుగా పెరిగి ఓయూలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చాయి. ఓయూలో 10 చోట్ల 'మియవాకి' విధానంలో నాటిన మొక్కలు వాటి సంరక్షణ కోసం హెచ్ఎండీఏ వారే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఉదయం, సాయంత్రం నిత్యం నీళ్లు పోసి సంరక్షణ కోసం నిత్యం ప్రత్యేక శ్రద్ధ చూపారు. మొక్కల మధ్యలో పెరిగిన గడ్డిని, పిచ్చి మొక్కలను కూడా వారే తొలగించి మొక్కల సంరక్షణ బాధ్యతలు స్వీకరించారు.
నీరుగారుతోన్న ఆశయం
నాటి ఇన్చార్జి వీసీ, కమిషన్ అరవింద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి ఓయూను ఒక దట్టమైన హరితవనంగా మార్చారు. దాని లో భాగంగానే ఇటీవలే రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ''ఆక్సి జన్ పార్క్ '' ను కూడా ప్రారంభించారు. తాము ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేశాము అని ఓయూ అధికారులు గొప్పలు చెప్పుకుం టున్నారు. కానీ ప్రస్తుతం హెచ్ఎండీఏ వారు వెళ్లి పోవడం, పర్యవేక్షణ బాధ్యత చూసే నాధుడు లేక ఓయూలో నేడు మొక్కలు ఎండిపోతున్నాయి. ఇంకొన్ని చోట్ల ఫెన్సింగ్ ఊడి గేదెలు, మేకలు వాటిని తినటం, ఇంకొన్ని చోట్ల ఓయూ సిబ్బంది లేక ఇతరులు ఎండి పోయిన ఆకులు, చెత్తను నిప్పు అంటించడంతో మంటలు వ్యాపించి మొక్కలు, వక్షాలు అగ్నికి ఆహుతవుతున్నాయి.
కనిపించని బోర్డ్‌లు.. మాయం అయిన వాటర్ ట్యాప్‌లు, పైపులు.
నాడు హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన ఐరన్ బోర్డ్‌లు కూడా మా యం కావడంతో పాటు మొక్కలకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ పైపులు, ట్యాప్‌లు కూడా కొన్ని సెక్టర్లు మాయమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, చెత్తుకు, ఎండిన ఆకుల నిప్పు ఎవరు పెట్టుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవులు, గేదెలు,మేకలు రాకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, అటు వాకర్స్, పర్యావరణ పరిరక్షణ నేతలు కోరుతున్నారు. రానున్న వేసవి కాలం ఈ సమస్యలు మరింత గా జఠిలం కాకుండా తక్షణమే సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
తక్ష ణమే అధికారులు స్పందించాలి
ఓయూ పర్యావరణ పరిరక్షణ సమితి తరపున హరిత హారం మొక్కలను పరిశీలిం చాము. అధికా రుల నిర్లక్ష్యం వల్ల ఉస్మానియా యూనివ ర్సిటీలో మొక్కలు నీళ్లు లేక ఎండిపో తున్నాయి. తక్షణమే అధికారులు మొక్కలకు నీళ్లు పెట్టి వాటిని కాపాడాలి. మరోపక్క ఇష్టారితిన చెత్తను కాల్చడం వల్ల మంటలు వ్యాపించి చెట్లు కాలిపోతున్నాయి అధికారులు మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించి, వక్షాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాము. తక్ష ణమే అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై, అధికారులపై చర్యలు తీసుకోవాలి.
-పర్యావరణ పరిరక్షణ సమితి ఓయూ అధ్యక్షుడు ఈఎన్‌వీ విజరు నాయక్
హెచ్ఎండీఏ బాధ్యతలు స్వీకరించాలి
మొక్కల నిర్వహణకు మా వద్ద నిధులు లేవు. ఇంకా ఈ మొక్కలు పెరిగే వరకు మళ్ళీ హెచ్ఎండీఏ వారే బాధ్యత చెప్పటాలి. లేదా వారు ఇతర దాతలు, సంస్థలు అయిన వీటి సంరక్షణ కోసం కషి చేసేలా చొరవ చూపాలి. మరొక రెండు సంవత్సరాలు హెచ్ఎండీఏ బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్నాము.
- ఓయూ గ్రీన్ బెల్ట్ డెరైక్టర్ డా.శ్రీనివాసులు