Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
చేనేత కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ సూచిం చారు. సోమవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయిని గమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట స్పెషల్ వెడ్డింగ్, ఉగాది సంప్రదాయ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభిం చారు. తెలంగాణకు చెందిన చేనేత మహిళా కళాకారులు ఆరుగురికి నగదు పురస్కారంతో పాటు ఘనంగా సత్కరించి వారిని ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. ఇక్కడి వస్త్రాలు చాలా ఆకర్షణీ యంగా ఉన్నాయని, చేనేత కళాకారుల నైపుణ్యం స్పష్టంగా కనబడుతుందని అన్నారు. చేనేత కళాకారులను ప్రోత్సహి స్తున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ నిర్వాహకులు శ్రీనివాసరావు, వినరు కుమార్ లను అభినందించారు. దేశంలోని ప్రముఖ చేనేత కళాకారులు తమ ఉత్పత్తులైన సిల్క్,కాటన్,డిజైనరీ చీరలను సుమారు 100 స్టాల్స్‌లో ఈనెల 21 వరకూ ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అరున్ కుమార్,హాండ్లూమ్ క్యురేటర్ శ్రీదేవి నిరుప్ పాల్గొన్నారు.