Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేదర సంఘం నగర అధ్యక్షులు కే మురళీ కృష్ణ
నవతెలంగాణ-అంబర్పేట
మహేంద్ర మెదరు కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మేదర సంఘం నగర అధ్యక్షులు కే మురళీ కృష్ణ కోరారు. సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోరుకుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేదర్ సంఘం ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, కోశాధికారి పాత కోటి మహేష్, ప్రచార కార్యదర్శి భార్గవ్, సంఘం పెద్దలు పుట్టా యాదగిరి, జోర్రి గల శ్రీధర్, రజినీ కాంత్, బాలచందర్, శ్రీశైలం,సత్తయ్య,నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.