Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూలోని మైక్రోబయాలజీ విభాగాన్ని సోమవారం డాక్టర్ తిరుమల దేవి కన్నెగంటి సందర్శించారు. మెంఫిస్, యూఎస్ఏలోని సెయింట్ జూడ్ పిల్లల ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రపంచంలోని అగ్రశ్రేణి 1 శాతం శాస్త్రవేత్తలలో ఆమె ఒకరు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ (పీహెచ్డీ 2001) పూర్వ విద్యార్థి కూడా. డాక్టర్ కన్నెగంటి ఉస్మానియా యూనివర్సిటీలో మైక్రోబయాలజీ విభాగాధి పతి, ఇండో-అమెరికన్ మాజీ విజిటింగ్ ప్రొఫెసర్ అయిన సందీప్త బూర్గులతో ఆమె కొనసాగుతున్న సహకారంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగాన్ని సందర్శించారు. ఆమె పర్యటన సందర్భంగా ఎంఎస్సీ మైక్రోబయాలజీ విద్యార్థులతో సంభాషిం చారు. వారి కెరీర్లో సైన్స్‌ను ఎంచుకోవడానికి వారిని ప్రోత్సాహించారు. సైన్స్‌ని వత్తిగా ఎలా కొనసాగించాలో పని కంటే అభిరుచిగా ఎలా కొనసాగించాలి అనే దాని గురించి మాట్లాడారు. విద్యార్థుల కెరీర్‌ను రూపొందిం చడంలో మంచి ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను ఆమె నొక్కిచెప్పారు. ఈ రోజు సైన్స్‌లో తన స్థానానికి తన పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు ఎలా కారణమో గుర్తుచేసుకున్నారు. ఓయూలోని మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో మైక్రోబయాలజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ డాక్టర్ హమీదా బీ, మైక్రోబయాలజీ రిటైర్డ్ ప్రొ. గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విద్యా ర్థులు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.