Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల పలు విభాగాల్లో ప్రతిష్టా త్మక ఐఎస్ఓ గుర్తింపు లభించింది. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ సాధించింది. పర్యావరణ గ్రీన్ ఆడిట్లో ఐఎస్ఓ 14001, ఎనర్జీ ఆడిట్ లో ఐఎస్ఓ 50001 ధ్రువీకరణ లభించింది. నాణ్యమైన, రుచికర మైన ఆహారాన్ని అందిస్తున్న గంగా, కిన్నెర, బాలికల హాస్టల్ మెస్‌లు, ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్, యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లకు ఫుడ్ సెఫ్టీ ఐఎస్ఓ 22000తో గుర్తించింది. ఆయా విభాగాల్లో నాణ్యతలో రాజీ లేకుండా కషి చేసిన ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, ఆయా విభాగాల అధిపతులు, పరిపాలనా అధికారులను వీసీ ప్రో. రవిందర్ అభినందించారు. ఈ కార్యక్ర మంలో రిజిస్ట్రార్ ప్రొ. పి. లక్ష్మీనారాయణ, ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.