Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని పటేల్ నగర్లో చిలకమ్మ గల్లీలో కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రయినేజీ సమస్యను స్థానిక బస్తి ప్రజలను అడిగి తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులని పిలిపించి సమస్య పరిష్కారం కోసం నూతన డ్రయినేజీ పైప్ లైన్ వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం నూతన డ్రయినేజీ పైప్ లైన్‌కు శంకుస్థాపన చేసి చిలకమ్మ గల్లీలో డ్రయినేజీ సమస్య లేకుండా చేస్తామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ మజీద్,వర్క్ ఇన్స్పెక్టర్లు రమేష్, దుర్గ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధికార ప్రతి నిధి మహేష్ ముదిరాజ్, హైమద్,నర్సింగ్ రావు, లవంగు లక్ష్మణ్, వినోద్ గంగపుత్ర, తదితరులు పాల్గొన్నారు.