Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ చరిత్ర కారుడు ప్రో.రతన్ లాల్
నవతెలంగాణ-ఓయూ
చరిత్ర పరిశోధనలు భారతీయ చరిత్ర ,సాంస్కృతిని ఓయూ చరిత్ర శాఖ సెమినార్ ప్రపంచ దేశాలకు నిర్మాణా త్మకం అయిన రీతిలో తెలియజేసిందని అలహాబాద్ కల్యాణి యూనివర్సిటీ మాజీ వీసీ, ప్రముఖ చరిత్ర కారుడు ప్రో.రతన్ లాల్ హాంగ్లు అన్నారు. సోమవారం ఓయూ చరిత్ర శాఖ ఆధ్వర్యంలో హెడ్ అండ్ కన్వీనర్ ప్రో.అం జయ్య పర్యవేక్షణ లో '' రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ '' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ ఓయూ అర్ట్స్ కళాశాలా సెంటినరి హల్ 133 రూమ్లో నిర్వహించారు. ప్రో.రతన్ మాట్లాడుతూ ఆచార్య ఆర్.సి. మంజూదర్ ఆధ్వర్యంలో వెలువడిన భారతీయ విద్యా భవన్ సిరీస్ సంపుటలు దేశ చరిత్రకు సంబంధించిన ప్రాచీన మధ్యయుగ, ఆధునిక చరిత్రలోని ఘట్టాలను నిష్పక్ష పాతంగా వివరించడంలో సఫలీకతం అయినట్టు చెప్పారు. నేటికి మంజూదర్ సంపుటలు దేశ చరిత్రకారులకు, పరిశోధకులకు,మార్గదర్శనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 1980 సంవత్సరానికి ముందు మంజూదర్ భారతీయ విశ్వవిద్యాలయయాల్లో జరిగిన చరిత్ర పరిశోధనలను తరువాత కాలంలో ఎన్నో రకాలుగా మార్పులకు లోనయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ సామాజిక, ఆర్థిక ,పునర్నిర్మాణం విషయం లో పెంపొందించిన పాత్రను చరిత్ర కారులు రచన ల్లో విభిన్న మైన కోణంలో అధ్యయ నం చేశారని చెప్పారు. చరిత్రకారులు అధికారులను అర్ధం చేసుకుని తమ భావా లను వక్రీకరించకుండా వ్యక్తం చేయా లని సూచించారు. యుగ విభజన దేశ చరిత్రలో తప్పనిసరి అయినప్పటికీ జాతీయ సమగ్రతను పరిరక్షించే విషయంలో ప్రాంతీయ స్థాయి చరిత్ర కారులు కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. విభాగం హెడ్ కన్వీనర్ డా.అంజయ్య మాట్లాడుతూ. ఇంత వరకు జరిగిన చరిత్ర పరిశోధన ల్లో ఉన్న సత్యలు,అసత్యాలు,ఇటీవలే కాలం లో లభ్యమైన ప్రాథ మిక ఆధారాల నైపథ్యం లను విశ్లేషించటానికి స్థానిక చరిత్ర, సంసతిని ,వారసత్వ సంపద పరిరక్షణకు సమాజా నికి తెలియజేయడమే ఈ రెండు రోజుల సెమినార్ ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పారు.సెమినార్ లో ఓయూ వీసీ ప్రో.రవీందర్, మాజీ వీసీ ప్రో.సులేమాన్ సిద్ధికీ, ఆర్ట్స్ కళా శాల ప్రిన్సిపాల్ ప్రో.చింత గణేష్, చరిత్ర విభాగం హెడ్ ప్రో.అంజయ్య, విభాగం అధ్యాపకులు ప్రో.ఇందిర ప్రో. లావణ్య, డా.రమేష్, డా.అరుణ, చరిత్రకారులు, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు.