Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఖేలో - ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్‌ను చరిత్రలో నగరవాసులకు తొలి సారిగా చూసే అవకాశం దక్కింది. ఓయూ క్యాంపస్‌లో సైక్లింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా, కేంద్రమంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్‌ను సోమవారం ప్రారంభించారు. సైక్లింగ్‌తోపాటు రోడ్ అండ్ ట్రాక్ క్రీడలను నిర్వహిస్తున్నామని ఖేలో - ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ కోఆర్డినేటర్ మాక్స్వెల్ ట్రేవర్, అదనపు ఆర్గనైజర్ ఎం.కే.పాశా తెలిపారు. ఈ పోటీల్లో 12-16 సంవత్సరాల వయస్సుగలవారితోపాటు 18 సంవత్సరాలపైన మహిళల పాల్గొంటున్నారు. సౌత్జోన్లో ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆరు రాష్ట్రాలు పాల్గొంటున్నాయన్నారు. ఈ పోటీలు సౌత్‌జోన్‌లోని బీజాపూర్, త్రివేండ్రంలో ముగుయనున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఓయూ క్యాంపస్‌లో సైక్లింగ్ ఈవెంట్ ఈనెల 16 వరకు జరుగనున్నాయన్నారు. ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 89 మంది మహిళా రైడర్లు పాల్గొంటారని తెలిపారు.