Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కార్మికులు సృష్టించిన సంపదను బడా పెట్టుబడిదా రులైన ఆదానీ, అంబానీలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ ధ్వజమెత్తారు. కార్పొరేట్ పరిశ్రమల అధిపతులకు మేలు చేస్తున్న మోడీ ప్రభుత్వంపై శ్రామిక వర్గం తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీ యూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హిమాయత్ నగర్‌లోని ఎన్.సత్యనారాయణరెడ్డి భవన్ లో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర సంఘాలు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంపన్న వర్గాలకు, పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచిపెడు తూ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని ధ్వజమె త్తారు. కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలు తిప్పికొట్టేం దుకు ఈ నెలలో ఏఐటీయూసీ ఇతర సంఘాలను కలుపుకుని, రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మే నెల నుంచి ఆగస్టు 8 వరకు క్విట్ ఇండియా దినోత్సవంలో భాగంగా పోరుయాత్రలు, మోటర్ సైకిల్ యాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించి సంఘటిత, అసంఘటిత శ్రామిక వర్గాల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు. ఆగస్టు 9న హైదరాబాద్‌లో భారీ నిరసన సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎప్పుడూ జరగని విధంగా కార్మిక హక్కులపై, చట్టాలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి, జీఎస్టీ భారం మోపి ప్రజలపై కార్మికులపై మోయలేని భారం మోపి మోడీ ప్రభుత్వం నడ్డివిరిచిందన్నారు. కార్మిక చట్టాల రక్షణ కోసం కార్మికవర్గంలో చైతన్యం కల్పించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. యథాతధంగా కార్మిక చట్టాలను అమలు చేయాలని, ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటీయూసీ సీనియర్ నాయకులు రత్నాకర్ రావు మాట్లాడుతూ..కార్మిక వర్గం రెట్టింపు ఉత్సాహంతో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యం.డి.యూసుఫ్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదలకు అనుగుణంగానే డి.ఎ. పెరుగుతుందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే డి.ఎ. పెంపుదల జరిగిందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ్మా మాట్లాడుతూ.. కార్మిక వర్గంలో సైద్దాంతిక ఆలోచన ఉన్నప్పటికీ కార్మిక వర్గ దక్పథాన్ని అలవర్చుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఏఐటియుసికి పలు యూనియన్లు అనుబంధంగా ఉన్నప్పటికీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బలమైన సంఘంగా ఉందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.చంద్రయ్య ''యూనియన్ రిజిస్ట్రేషన్, అనుబంధ రుసుము అన్న'' అంశంపై సుదీర్ఘంగా వివరిం చారు. 34 అంశాలను లోతుగా వివరించారు.పలువురు నాయకులు అడిగిన అంశాలకు వివరణ ఇచ్చారు.శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్ గా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.ప్రేంపావని వ్యవహరించారు.