Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హయత్ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 61,61ఎ కేంద్రాల్లో సోమవారం మొత్తం 900మంది ఓటర్లు ఉండగా, 814 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారిలు సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హయత్‌నగర్ పోలీసులు 3అంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎల్బీనగర్
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం నిర్వహించారు. సరూర్ నగర్ వీఎం హోమ్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్కడే మకాం వేసి పోలింగ్ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్నారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల టీచర్ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సరూర్‌నగర్‌లోని వీఎం హోమ్‌లో ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి పోలింగ్ సరళిని, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలిం చారు. 3085ఓటర్లకు గాను 2537 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకునారు. సరూర్‌నగర్ పరిధిలో 82.24 శాతం పోలింగ్ అయినట్లు పోలింగ్ అధికారి జయశ్రీ తెలిపారు.
మీర్పేట్
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు (74,74/ఎ) పోలింగ్ కేంద్రాలలో మొత్తం ఓటర్లు 1110 ఉండగా 955 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్, ఎల్బీనగర్ డీసీపీి సాయి శ్రీ, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బాలాపూర్ తహసీల్దార్ జనార్దన్ రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు మానిక్ రెడ్డి, ఏవిఎన్ రెడ్డి తదితరులు సందర్శించడం జరిగింది.