Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకేరోజు ఐదుగురు నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల పెండ్లిలకు మంగళసూత్రం,మెట్టెలు విరాళం
నవతెలంగాణ-నాగోల్
నాగోల్, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో ఉప్పల శ్రీనివాస్‌గుప్త క్యాంప్ కార్యాలయంలో ఐదుగురు అమ్మాయిల వివాహం గురించి, బీదర్‌కు చెందిన శిల్ప, రాజన్న సిరిసిల్లకు చెందిన గిద్దల అఖిల, బొగ్గులకుంటకు చెందిన పేదింటి యువతి, తట్టి అన్నారం, అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన ప్రీతి, కామారెడ్డి జిల్లా, ఘన్‌పూర్‌కు చెందిన తేజ, వారి కుటుంబ సభ్యులు వచ్చి కలిసిన సందర్భంగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని, ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల ఫౌండేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, పెద్ద కుమారుడు ఉప్పల సాయి తేజ చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిల పెండ్లిల్లకు మంగళ సూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళం ఇవ్వడం జరుగు తున్నది. ఈ విరాళం ఒక్క పేద ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా అన్ని కులాలకు చెందిన వారికి, అన్ని ప్రాంతాల నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెండ్లి కోసం పుస్తె, మెట్టెలు, చీర, గాజులు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం, కేసీఆర్ మానసపుత్రిక అయిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంను నిరుపేద అడబిడ్డలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.